టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గంలో 83 కి.మీల మేర రోడ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరయ్యాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లు 29 కి.మీలు, పంచాయతీరాజ్ రోడ్లు 54 కి.మీల అభివృద్ధికి ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆర్‌అండ్‌బీకి సంబంధించి పెద్దాపూర్–అనంతసాగర్ (వయా తొగర్‌పల్లి)రోడ్డు, ముంబై హైవే నుంచి– బ్యాతోల్, ముంబై హైవే–ఇస్మాయిల్‌ఖాన్‌పేట రోడ్లను అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి ఎన్.హెచ్ 65 నుంచి చిమ్నాపూర్‌తాండా, సంగారెడ్డి –మల్కాపూర్ ఎక్స్‌రోడ్డు, సంగారెడ్డి–తాళ్లపల్లి, శంకర్‌పల్లి రోడ్డు–చేర్యాల, మామిడిపల్లి –గొల్లగూడెం, ఎర్దనూర్–ఇస్మాయిల్‌ఖాన్‌పేట, శంకర్‌పల్లిరోడ్డు–చెర్లగూడెం, ఎన్‌హెచ్65–మాచిరెడ్డిపల్లి, అనంతసాగర్–సదాశివపేట రోడ్ల అభివృద్ధి పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని జగ్గారెడ్డి తెలిపారు.


