సైబర్‌ నేరాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అవగాహన ఉండాలి

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌/సంగారెడ్డి క్రైమ్‌: సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. సైబర్‌ నేరాల బారినపడకుండా ఉండేందుకు సోషల్‌ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్‌ మోసాలను గుర్తించే విధానం వంటి అంశాలపై విద్యార్థులకు సూచనలు చేశారు. సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ..సైబర్‌ మోసాలు, వివిధ రూపాలు వాటి నుంచి రక్షణ పొందే మార్గాలు, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, సోషల్‌ మీడియా మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సెయింట్‌ ఆంథోనీస్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు సైబర్‌ పత్రికపై అవగాహన కల్పించే పోస్టర్లను రూపొందించారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్‌, పట్టణ సీఐ రామునాయుడు, సెయింట్‌ ఆంథోనీస్‌ విద్యాసంస్థల అధినేత సాల్మన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement