నిండిన నల్లవాగు ప్రాజెక్టు | - | Sakshi
Sakshi News home page

నిండిన నల్లవాగు ప్రాజెక్టు

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

1,506 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో

నారాయణఖేడ్‌: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగుపై నుంచి నీరు పొంగి పొర్లుతోంది. ఎగువన కంగ్టి, నాగల్‌గిద్ద మండలాల్లో కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకల ద్వారా ప్రవహించిన నీటితో నల్లవాగు ప్రాజెక్టు నిండింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1,493 అడుగులు కాగా అర్థరాత్రి వరకు కురిసిన వర్షం వల్ల 1,493.5 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 1,506 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా..ఔట్‌ఫ్లో కూడా 1,506 క్యూసెక్కులు అలుగుపై నుంచి కిందకు ప్రవహిస్తోంది. కర్ణాటక ప్రాంతంలోని గుడుపల్లి గుట్టల్లో పుట్టిన నల్లవాగు దేశాయ్‌ వడ్‌గాం ప్రాంతం గుండా కంగ్టి మండలం నాగూర్‌(బి) వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. సిర్గాపూర్‌ మండలంలోని సుల్తానాబాద్‌ వద్ద ప్రాజెక్టు నిర్మితమై ఉంది. దీనికింద 6,060 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ప్రాజెక్టు నిండటంతో ఆయకట్టు పంటల సాగుకు అనుకూలంగా మారింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని వదలడం వల్ల పోచాపూర్‌, బీబీపేట్‌, ఖానాపూర్‌, మార్డి, కల్హేర్‌ గ్రామాల్లోని చెరువులను నింపుకొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement