నారాయణఖేడ్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి సూచించారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పేట్‌లో ఫ్రైడే– డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. టైర్లు, పాత్రల్లో నీటిని నిల్వ ఉంచితే దోమలు ప్రబలుతాయని వివరించారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. శానిటరీ అధికారి శ్రీనివాస్‌తో కలిసి పనులను పర్యవేక్షించారు.
సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలసదన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణకు తోడ్పడాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. న్యాయ పరమైన విషయంలో ఉచిత సాయం అందిస్తామని తెలిపారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు.
సంగారెడ్డి జోన్: ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి అ న్నారు. కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి ఏఎస్‌ఐగా ఉద్యోగ విరమణ పొందుతున్న మోహన్‌ను శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో సన్మానించి జ్ఞాపిక అందించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో చేసిన సేవలకు గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్ర మంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మావతి, ఏఆ ర్ డీఎస్పీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
చిలప్‌చెడ్(నర్సాపూర్): గ్రామాల్లో వందశాతం పారిశుద్ధ్యం సాధించాలంటే విద్యార్థులే కీలకపాత్ర పోషిస్తారని డీఎల్‌పీఓ సురేశ్‌బాబు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఫైజాబాద్ పంచాయతీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వారికి స్వచ్ఛత కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు స్వచ్ఛతపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రజలు చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి కార్మికులకు అంజేయాలని, వారు సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులో పారబోయాలన్నారు. అధికారులు, పాలకులు, ప్రజలతోనే గ్రామాల్లో వందశాతం పారిశుద్ధ్యం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఎంపీఓ మునిరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ సర్వేను సక్రమంగా నిర్వహించి రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శాలిపేటలో భూభారతి సర్వేను నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతి రీ సర్వే ద్వారా అందరి రైతుల పొలాల హద్దులు, ఇతర సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. సమావేశంలో సర్పంచ్ పోశెట్టి, మండల రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.


