వర్షాలకు కూలిన ఇల్లు | - | Sakshi
Sakshi News home page

వర్షాలకు కూలిన ఇల్లు

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

వర్షాలకు కూలిన ఇల్లు

కోతకు గురైన రోడ్డును పరిశీలిస్తున్న పరమేశ్వరి

నిజాంపేట(మెదక్‌): మండల పరిధిలోని జెడ్‌ చెరువు తండాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రమావత్‌ చిల్లి మంతులాల్‌ ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఇంటి గోడ కూలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇల్లు కూలిపోవడంతో నివాసం లేక రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ’ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేయాలని కోరారు.

రామాయంపేట(మెదక్‌): ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని దెబ్బతిన్న పర్వతాపూర్‌ రహదారిని బుధవారం మెదక్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ పరమేశ్వరి పరిశీలించారు. పుష్పాలవాగు బ్రిడ్జి వద్ద రోడ్డు చివరలో కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారడంతో బస్సు నడపడం కష్టతరమని వ్యాఖ్యానించారు. ఈ దారిలో బస్సు తిరిగితే మట్టి రోడ్డులో దిగబడి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. వెంటనే రోడ్డును మరమ్మతులు చేయించాలని పర్వతాపూర్‌ సర్పంచ్‌ తార్యానాయక్‌కు సూచించారు. మరమ్మతులు చేయిస్తానని, బస్సును బంద్‌ చేయవద్దని సర్పంచ్‌ డీఎంకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement