మెదక్ కలెక్టరేట్: కార్మికుల హక్కుల పరిరక్షణ, న్యాయమైన డిమాండ్ల సాధనలో తమ యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధాకిషన్‌రావు(ఎంఆర్‌కేరావు ) తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఎంయూ జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ. ప్రతీ సభ్యుడు క్రమశిక్షణ, ఐక్యత, అంకితభావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో టీఎంయూ ఘనవిజయానికి కృషి చేయాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా పడిగే నర్సింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎజాజుద్దీన్, డిపో సెక్రెటరీగా సంగమేశ్వర్, అదనపు సెక్రెటరీగా కొత్తరాజు తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు శాకయ్య, సుబ్బారావు, ఎం.యాదగిరి, అష్ఫాక్ అహ్మద్, జీపీరాజు పాల్గొన్నారు.
టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌కేరావు


