అర్జీలు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు త్వరగా పరిష్కరించాలి

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

సంగారెడ్డి జోన్‌: ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులతో మొరపెట్టుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్లలో నిర్వహించిన ప్రజావాణిలో 99 ఫిర్యాదులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement