గురుకులంలో స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

గురుకులంలో స్పాట్‌ అడ్మిషన్లు

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

జహీరాబాద్‌ టౌన్‌: కోహీర్‌ మండలం దిగ్వాల్‌లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఈ నెల 29న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రాములు సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకుల కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో 12, బైపీసీలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. బీసీలకు 4, ఎస్టీలకు 2, ఎస్సీలకు 14, ఓసీలకు ఒక సీటు కేటాయిస్తామన్నారు. అడ్మిషన్‌ కోసం బుధవారం ఉదయం 11 గంటల లోపు విద్యార్థులు అన్ని ఒరిజినల్‌ పత్రాలతో సకాలంలో హాజరుకావాలని సూచించారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో

అంతరాయం

పటాన్‌చెరు టౌన్‌: బీరంగూడ పరిధిలోని గోశాల 33/11 కేవీ సబ్‌స్టేషన్‌న్‌ పరిధిలోని 11 కేవీ శివాలయం ఫీడర్‌ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నందున మంగళ వారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనున్న ట్లు ఏఈ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధుర నగర్‌, భ్రమరాంబిక, మల్లికార్జున హిల్స్‌, బీరంగూడ ప్రాంతాల్లో సరఫరాను నిలిపివేయనున్నారు. అలాగే పటేల్‌గూడ 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని 11 కేవీ రాఘవేంద్ర ఫీడర్‌లో నిర్వహణ పనుల వల్ల మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐక్యత హోమ్స్‌, రాఘవేంద్ర కాలనీ, కృష్ణానగర్‌, మారుతీనగర్‌లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు.

బాధితులకు సత్వర న్యాయం

సంగారెడ్డి జోన్‌: బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు

ఫీజు బకాయిలపై

బీజేపీ సమరభేరి

నారాయణఖేడ్‌: పెండింగులో ఉన్న రూ.15 వేలకోట్ల ఫీజు, ఉపకారవేతనాల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ సమరభేరి మోగిస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోణం విఠల్‌, మండల అధ్యక్షుడు సిందోల్‌ దశరథ్‌, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్‌ తెలిపారు. సమరభేరిలో భాగంగా 17, 18వ తేదీ ల్లో ఫీజుల బకాయి– బీజేపీ లడాయి పేరిట ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ బకాయిలతో 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. నాయకులు పెద్దశంకరంపేట మండల అధ్యక్షుడు శ్రావణ్‌, సుగుణాకర్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ధర్నాను విజయవంతం చేద్దాం: తపస్‌

వెల్దుర్తి(తూప్రాన్‌): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్‌ 1న నిర్వహించనున్న చలో హైదరాబాద్‌ ధర్నాను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం మాసాయిపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, హెల్త్‌ కార్డుల జారీ, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు వంటి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్య ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఈ ఓ మధుసూదన్‌రావు, నాయకులు భద్రయ్య, ఝాన్సి తో పాటు మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement