న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026
హత్నూర మండలం పల్పనూర్‌కు చెందిన మంగలి శ్యామలకు ఐదేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. ఇటీవల తన భర్త శివకుమార్ గుండెపోటుతో మరణించాడు. దీంతో తన ఇద్దరు పిల్లలను సాకటం కష్టంగా మారింది. భర్త పేరు మీద కొంత పొలం ఉన్నప్పటికీ రైతు బీమా నమోదు చేసుకోకపోవడంతో బీమా డబ్బులు రాలేదు. బతుకు భారంగా మారిందని తనకు ఏదైనా దారి చూపాలని, బీ మా డబ్బులు వచ్చేలా చేయాలని సోమవారం ప్రజావాణిలో తల్లితో కలిసి వచ్చి కలెక్టర్‌ను వేడుకుంది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి


