యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంతోపాటు పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల వల్ల వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నా కనీసం ఆలోచన చేయడం లేదన్నారు. విద్యార్థుల కు రావాల్సిన కాస్మోటిక్ చార్జీలు సైతం రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయడం లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రశాంత్, జిల్లా అధ్యక్షుడు సందీప్, రాష్ట్ర కమి టీ సభ్యుడు రవితేజ, జిల్లా కార్యదర్శి ప్రశాంత్, జిల్లా నాయకులు సుదర్శన్, నవీన్, తులసి, రుక్మిణి, వెంకటేశ్, శ్రీలత, ధరణి, ప్రియాంక, చందన, సాహితి, సాకేర పాల్గొన్నారు.


