పూర్తిగా ధ్వంసమైన రహదారి
జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ గ్రామ రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రజలు నరకం చూస్తున్నా రు. రోడ్డు పొడువునా పడిన గుంతలు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు రాస్తారోకో నిర్వహించినా, కలెక్టర్‌ను కలసి వినతిపత్రాలు అందజేసినా ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అల్గోల్ రోడ్డు జహీరాబాద్ పట్టణం నుంచి పొట్‌పల్లి మీదుగా ఎల్గోయి వరకు ఉన్న నిమ్జ్ ప్రాజెక్టు ప్రాంతం వరకు వెళ్తుంది. కొన్నేళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోవడంలేదు. రోడ్డు పొడువునా పెద్ద పెద్ద గుంతలేర్పడ్డాయి. గుంతల కారణంగా వర్షం నీరు చేరి ప్రయాణం నరకయాతనగా మారింది. ఆటోలు, మోటారు బైక్‌లు అదుపుతప్పి పడిపోతున్నాయి. వాస్తవానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.65 కోట్ల నిధులు కూడా మంజూరు కాగా సకాలంలో మరమ్మతులు చేపట్టని కారణంగా అవికూడా రద్దయ్యాయి.
రూ. 3 కోట్లతో ప్రతిపాదనలు
జహీరాబాద్ నుంచి అల్గోల్ వరకు గల సుమారు 6 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతుల కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపా రు. ఇంత వరకూ నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేసి దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి కోరుతున్నారు.


