మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే.. | - | Sakshi
Sakshi News home page

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే..

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

రేగోడ్‌(మెదక్‌): మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని విద్యార్థులనుద్దేశించి అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. సోమవారం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వంట సరుకులు, పలు రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. అదనపు గదుల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తానని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువు, లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ.. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాన్నారు. ప్రతీ విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దత్తారెడ్డి, ప్రిన్సిపాల్‌ స్వయంప్రభ, ఆర్‌ఐ శరణప్ప తదితరులు ఉన్నారు.

ఆధార్‌లో వివరాల నమోదు

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రతి పౌరుడు తమ ఆధార్‌లో పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌, అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈ–డిస్ట్రిక్‌ అధికారులు, ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సకాలంలో పొందాలంటే ఆధార్‌ వివరాలు కచ్చితంగా, తాజా సమాచారంతో ఉండడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement