వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్
సిద్దిపేటరూరల్: విద్యార్థులు పాఠశాల దశలోనే లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, సాధన దిశగా అడుగులు వేయాలని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మోటివేషనల్ స్పీకర్ రవీందర్ విద్యార్థులకు సూచించారు. నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కొమ్మూరి పద్మ అధ్యక్షతన సంకల్ప సిద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీందర్ హాజరై మాట్లాడారు. నాలుగో తరగతిలోనే లక్ష్య సాధన కోసం తాను ఏర్పరచుకున్న ఆలోచనను తన గురువుతో పంచుకున్న అబ్దుల్ కలాం విజయ గాథను విద్యార్థులకు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్‌లో ప్రారంభమైన వేసవి శిబిరం తీరును సంకల్ప సిద్ధి కార్యక్రమం కోఆర్డినేటర్ వరప్రసాద్ వివరించారు. శిబిరంలో పాల్గొన్న 120 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, మెటల్ వాటర్ బాటిల్, జామెట్రీ బాక్స్, స్టూడెంట్ డైరీతో కూడిన కిట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


