ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Jul 23 2026 6:48 AM | Updated on Jul 23 2026 6:48 AM

నారాయణఖేడ్‌: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డ నిందితుడిని ఖేడ్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఖేడ్‌ సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సై శ్రీశైలం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఖేడ్‌ నియోజకవర్గంతో పాటు మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని పిట్లం, నసురుల్లాబాద్‌, పాపన్నపేట ప్రాంతాల్లో 10 రోజుల్లో పలు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఖేడ్‌ ఎస్‌ఐ ఆధ్వర్యంలో సిబ్బంది యాదుల్‌, ముజమ్మిల్‌, హరితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా ఈ బృందం చోరీలను ఛేదించింది. కాగా సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం అంబోజీగూడకు చెందిన దుర్గాప్రసాద్‌ బైకులను చోరీ చేసినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఇప్పటికే 16 చోరీ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా కేసును ఛేదించిన ప్రత్యేక బృందాన్ని సీఐ అభినందించారు.

సంగాపూర్‌ ఆభరణాల చోరీ కేసులో..

రాయికోడ్‌(అందోల్‌): తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ చైతన్యకిరణ్‌ కథనం మేరకు.. ఈ నెల 18న మండలంలోని సంగాపూర్‌ గ్రామానికి చెందిన కే.నగేశ్‌ ఇంట్లో దొంగతనం జరిగింది. పగటిఫూట ఇంటితాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న 20 తులాల పట్ట గొలుసులు, రూ.25 వేల విలువైన ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఇంటికి చేరుకున్న నగేశ్‌ దంపతులు చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో గ్రామానికి చెందిన ఎం.బసవరాజ్‌ను బుధవారం అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

బైక్‌ చోరీ నిందితుడి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement