నర్సాపూర్ రూరల్: పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని మల్లారెడ్డి అగ్రికల్చర్ సైన్స్ యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వ్యవసాయంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసం గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలు, వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు. శాసీ్త్రయ పద్ధతిలో వ్యవసాయంపై అవగాహన కల్పించి తల్లిదండ్రులకు వివరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు, గ్రామస్తులు , పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


