పీఎస్‌లో ఎంపీ రఘునందన్ ఫిర్యాదు
పటాన్‌చెరు: పటాన్‌చెరులోని పాఠశాల కూల్చివేతపై ఎంపీ రఘునందన్‌రావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 7వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాల తరగతి గదుల నిర్మాణాలను కూల్చివేశారు. అదేరాత్రి ఎంపీ రఘునందన్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌కు, పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కూల్చివేతను ఆపాలని ఆదేశించగా... అప్పటికే బడిని నేలమట్టం చేసేశారు. ఈ నెల 9న కూల్చివేతకు గురైన పాఠశాల భూమిని ఎంపీ పరిశీలించిన సంగతి తెలిసిందే. ఎంపీ చొరవపై స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెతుత్తున్నాయి. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాల పాటు స్థానికులకు విద్యనందించిన పాఠశాలను నేల మట్టం చేసేశారని అలాంటి దోషులకు శిక్ష పడే వరకు తాను ఊరుకోనన్నారు. కూల్చివేతకు వాడిన యంత్రాలను, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అత్యంత విలువైన ఆ భూమిని కాపాడి అక్కడ పాఠశాల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


