గజ్వేల్: మున్సిపాలిటీల్లో మెరుగైన పాలన, వసతుల కల్పనకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ దోహదపడనుందని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన, కమిషనర్ వెంకటగోపాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కాగా పాండవుల చెరువులో చేపట్టిన వ్యర్థాల తొలగింపు, డంప్‌యార్డు నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లక్ష్మి, మురళి, స్వప్న, రూప తదితరులు పాల్గొన్నారు.
సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్వర్‌రావు


