శివ్వంపేట(నర్సాపూర్): ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని లీవ్ ఫామ్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ రంగనాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దగొట్టిముక్కల గ్రామంలో రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు గ్రామంలో సాగు చేస్తున్న 2 సంవత్సరాల వయస్సు గల ఆయిల్ పామ్ పంటను పరిశీలించి పలు సూచనలు చేశారు. పంట 4వ సంవత్సరం నుంచి కోతకు వస్తుందన్నారు. ఎకరాకు నెలకు సగటున 7 నుంచి 9 టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. మార్కెట్‌లో టన్ను ధర రూ.22 వేలు ఉందన్నారు. ఎకరాకు నెలకు 15 వేల నుంచి 18 వేల ఆదాయం వస్తుందన్నారు.


