కల్హేర్(నారాయణఖేడ్): రైతుల సమస్యలు తీర్చేందుకు భూ రీసర్వే నిర్వహిస్తున్నామని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. శుక్రవారం సిర్గాపూర్ మండలం ఖాజాపూర్‌లో గ్రామ సభ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ... భూ సర్వే నిర్వహించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఖాజాపూర్ గ్రామం ఎంపికై ందని తెలిపారు. రైతులకు పొలం గట్లు, హద్దుల సమస్యలు పరిష్కారం చేసేందుకు రీసర్వే ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి, డీప్యూటీ తహసీల్దార్ హేమంత్‌కుమార్, సర్పంచ్ రమ్య, ఉపసర్పంచ్ షేక్ హబీబ్ పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ ఉమా హారతి


