మెదక్‌జోన్: మెదక్ ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించే సూపరింటెండెంట్ లతీఫ్‌ఉద్దీన్ ముజాయుద్దీన్, మెడికల్ బిల్లులను సక్రమంగా ఉన్నతాధికారులకు పంపటం లేదని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ బిల్లుల విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇటీవల డీజీపీకి ఫిర్యాదు చేయటంతో శుక్రవారం రికార్డులను తనిఖీ చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారి విధులను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తించామని చెప్పారు. తన సెక్షన్‌లో 282 బిల్లులను ఉన్నతాధికారులకు పంపకుండా పెండింగ్‌లో పెట్టాడని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఏసీబీ పేర్కొన్నారు.
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి
సుదర్శన్‌రెడ్డి


