ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే రోహిత్
మెదక్ కలెక్టరేట్: వయో వృద్ధుల సంక్షేమం కోసమే డే కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలో వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను వారు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన సొంత నిధులతో సెంటర్‌కు బ్యాటరీ వెహికిల్ అందిస్తానని తెలిపారు. డే కేర్ సెంటర్ ద్వారా జిల్లాలోని వయోవృద్దుల కాలక్షేపానికి, అడుకునే ఆట సామగ్రి, వార్తా పత్రికలు, పుస్తకాలు, సరదాగా వంట చేసుకుని తినడానికి సామగ్రి అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వయో వృద్ధుల సంక్షేమం కోసం అధికారులందరూ పని చేయాలన్నారు. కార్యక్రమలో మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్, సేవా సంఘం స్వచ్ఛంద సంస్థ బాధ్యులు సతీష్, శ్రీధర్ డిసబుల్ సెక్షన్ అధికారి జింక రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


