ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కంది(సంగారెడ్డి): గ్రామాల అభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. కంది మండల పరిధిలోని చిమ్నాపూర్‌లో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...పంచాయతీ భవనాల ద్వారా గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు. నాయకులు ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని ఆ తర్వాత అందరూ కలిసికట్టుగా గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చిమ్నాపూర్ సర్పంచ్ కృష్ణగౌడ్, ఉపసర్పంచ్ మోతిలాల్ నాయక్, కంది సర్పంచ్ శ్రీరామ్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి చేర్యాల ఆంజనేయులు, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు నరహరిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కంది సొసైటీ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


