గంజాయి తరలింపు.. యువకుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలింపు.. యువకుల అరెస్టు

Mar 7 2026 10:13 AM | Updated on Mar 7 2026 10:13 AM

పటాన్‌చెరు టౌన్‌: గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి సుమారు 1.41 కిలోల గంజాయి, నాలుగు సెల్‌ ఫోన్‌లు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్‌ సీఐ పరమేశ్వర్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ముత్తంగి ఓఆర్‌ఆర్‌ బ్రిడ్జి సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అయితే అనుమానస్పదంగా ఉన్న రెండు ద్విచక్రవాహనాలను తనిఖీ చేసి యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు పెద్దపల్లికి చెందిన తరుణ్‌, చంద్రశేఖర్‌, షేక్‌ అబ్దుల్‌, ఆకుల తేజలను అరెస్ట్‌ చేసి గంజాయిని పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement