వివాహిత...
పటాన్‌చెరు టౌన్: పట్టణంలో ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ సంఘటన స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తంగి డివిజన్‌కు చెందిన కృష్ణ, క్యాతమ్మ భార్యభర్తలు. అయితే వీరిద్దరూ కొంతకాలంగా గొడవ పడుతున్నట్లు స్థానికులు తెలి పారు. ఈ క్రమంలో గురువారం కృష్ణ బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి భార్య కనిపించలేదు. దీంతో బంధువులు, తెలిసినా వారిని, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. అనంతరం భార్య కనిపించడం లేదని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గృహిణి...
చేగుంట(తూప్రాన్): మాసాయిపేట మండలం నాగసాన్‌పల్లికి చెందిన గృహిణి అదృశ్యమైనట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. నాగసాన్‌పల్లికి చెందిన అట్టెం మమత, యాదగిరి భార్యాభర్తలు. మమత ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో గురువారం మమత ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. బంధువుల వద్ద చుట్టూ పక్కల గ్రామాల్లో వెతికినా కనిపించలేదు. దీంతో మమత భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


