ఇన్నోవేషన్‌ ప్రాజెక్టుకు విద్యార్థి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఇన్నోవేషన్‌ ప్రాజెక్టుకు విద్యార్థి ఎంపిక

Mar 5 2026 8:45 AM | Updated on Mar 5 2026 8:45 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్నోవేషన్‌ ప్రాజెక్టు నామినేషన్‌కు మండలంలోని సూరారం జెడ్పీపాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సంపత్‌ కుమార్‌ ఎంపికై నట్లు హెచ్‌ఎం సాయిరెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే సైన్స్‌ఫెయిర్‌లో విద్యార్థి ప్రదర్శించే బోర్‌వెల్‌ ఏరియాకు చిన్నారులు వస్తే అలర్ట్‌ చేసే పరికరం రూపొందించాడు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల నిధులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఉపాధ్యాయులు, హెచ్‌ఎం అభిందించారు.

కూచన్‌పల్లి విద్యార్థి..

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండలంలోని కూచన్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌(పీఎంశ్రీ) విద్యార్థిని అభినయకు అరుదైన గౌరవం దక్కిందని హెచ్‌ఎం మధుమోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని రూపొందించిన ప్రాజెక్ట్‌ జాతీయ సైన్స్‌ ఇన్నోవేషన్‌ 2025–26కు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతోపాటు ప్రధానోపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.

ఉగాది బాలల పోటీలకు

470 కథలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సుగుణ సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది జిల్లా స్థాయి బాలల కథల పోటీ –2026కు గాను 470 కథలు వచ్చాయని, ఆ సంస్థ కన్వీనర్‌ బైతి దుర్గయ్య బుధవారం తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వంద కథలు ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ కథలు న్యాయ నిర్ణేతలకు పంపించి ఏప్రిల్‌లో ఫలితాలు ప్రకటించి, విజేతలకు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.

అడవికి నిప్పు పెట్టిన దుండగులు

జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం వావిలాల గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం మధ్యాహ్నం నిప్పు పెట్టారు. దీంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. వేసవికాలం కావడంతో ఎండిన ఆకులు తగలబడుతూ పలు రకాల చెట్లు ప్రకృతి సంపద కాలి బూడిదైంది. రోడ్డు పక్కన వెళ్లే వాహనదారులు మంటలను చూసి భయాందోళనకు గురయ్యారు. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గంజాయి విక్రయిస్తున్న

వ్యక్తి అరెస్ట్‌

పటాన్‌చెరు టౌన్‌: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పటాన్‌చెరు ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎకై ్సజ్‌ సీఐ పరమేశ్వర్‌ గౌడ్‌ వివరాల ప్రకారం... పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో ఐడీఏ ఫేజ్‌ 2లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్టీఎఫ్‌డీ బృందం సీఐ నాగరాజు నిఘా పెట్టారు. ఓ పరిశ్రమ సమీపంలో పటాన్‌చెరు శాంతి నగర్‌కు చెందిన ఆకాశ్‌ దాస్‌ గంజాయి విక్రయిస్తుండగా మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

మందుబాబుల వీరంగం

మద్దూరు(హుస్నాబాద్‌): మండలంలోని బైరాన్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మందుబాబులు బీభత్సం సృష్టించారు. హోలీ సెలవు కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో మద్యం తాగి ఖాళీ సీసాలను అక్కడే పడేశారు. అలాగే విద్యుత్‌ బోర్డులోని ప్యూజులు, సర్జ్‌ ప్రొజెక్టర్‌ డివైజర్లను అపహరించుకుపోయారు. బుధవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు ,విద్యార్థులు ఈ దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. విద్యా మందిరాన్ని అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement