సంగారెడ్డి జోన్: జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్‌లో ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేపట్టింది. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో పరిశ్రమ ప్రతినిధులు, కలెక్టర్ ప్రావీణ్య రిక్రూట్‌మెంట్ 2026 పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్ ఆధ్వర్యంలో 800 పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పరిశ్రమలో చేపట్టే ఉద్యోగ నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు నేరుగా అధికారికంగా అందించిన పోర్టల్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే నమోదు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువత, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్, పి.వంశీధర్ రెడ్డి. జీఎండీఐసీ తుల్జానాయక్, తదితరులు పాల్గొన్నారు.
రిక్రూట్‌మెంట్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్


