ప్రతిభ కనబర్చిన వారికి కూపన్లు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ కనబర్చిన వారికి కూపన్లు

Mar 5 2026 8:45 AM | Updated on Mar 5 2026 8:45 AM

సిద్దిపేటకమాన్‌: పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా వేదికగా నిర్వహించిన షార్ట్‌ వీడియోల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఓ వినోద సంస్థకు సంబంధించిన ఉచిత కూపన్లను సీపీ రష్మీ పెరుమాళ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సైబర్‌ నేరాలపై అవగాహన, మహిళల భద్రత, వేధింపుల నిరోధం, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన వంటి పలు అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు వీడియోలను రూపొందించారని తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇప్పటికే బహుమతులు ప్రదానం చేశామని పేర్కొన్నారు. దీనికి ఆకర్షితులైన ఓ వినోద సంస్థ విజేతలకు ఉచిత కూపన్లను స్పాన్సర్‌ చేసినట్లు తెలిపారు. అలాగే షార్ట్‌ వీడియో కాంటెస్ట్‌ 2.0ను ప్రారంభించినట్లు వివరించారు. సమాజంలో చైతన్యం నింపేందుకు యువత, కంటెంట్‌ క్రియేటర్లు, ఇన్‌ప్లుయెన్సర్లు ఈ పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అందజేసిన సిద్దిపేట సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement