నిందితులను కఠినంగా శిక్షించాలి
అంగన్‌వాడీ టీచర్, ఆమె భర్తపై దాడి దుర్మార్గం
యూనియన్ ఆధ్వర్యంలోఅదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు
మెదక్ కలెక్టరేట్ : అంగన్వాడీ టీచర్‌తోపాటు ఆమె భర్తపై దాడికి పాల్పడిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సమ్మ డిమాండ్ చేశారు. శనివారం సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నగేశ్‌ను కలిసి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ... హవేళి ఘనాపూర్ మండలంలోని ముత్తాయికోట గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ వేదభూమితోపాటు ఆమె భర్తపై ఈనెల 2న ఇదే గ్రామానికి చెందిన పార్దిగళ్ల లకీ్‌ష్మ్‌పతి అంగన్వాడీ కేంద్రంలోకి చొరబడి అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించారు. అలాగే టీచర్‌తోపాటు ఆమె భర్తపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడని చెప్పారు. ఈ దాడిలో టీచరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో పేరుంటేనే గర్భిణులకు, బాలింతలకు గుడ్లు, పాలు ఇవ్వాలని పైఅధికారులు చెబుతున్నారన్నారు. అకారణంగా దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రజిత, మంగ,మమత, రాణి, సబిత, మంగమ్మ పాల్గొన్నారు.


