కేతకీలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం
ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. శనివారం ఆలయ ఆవరణలో అర్ధ నక్షత్రాన్ని పురస్కరించుకొని తెలంగాణ అర్చక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్వతీపరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను ఉంచి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు డా.సిద్ధేశ్వర స్వామి, మాజీ ఎంపీపీ హన్మంత రావు పాటిల్, పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఈవో శివ రుద్రప్ప, నాయకులు, అర్చకులు పాల్గొన్నారు.


