మెట్రో ప్రయాణం సంతోషంగా ఉంది
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): మెట్రో రైల్లో ప్రయాణం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. సోమవారం రామచంద్రాపురంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ...మండలి శీతాకాల సమావేశాలకు మియాపూర్ నుంచి అసెంబ్లీ వరకు మెట్రో రైల్లో వెళ్లినట్లు వివరించారు. మైట్రో రైలులో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సకాలంలో గమ్యానికి చేరుకుంటామని తెలిపారు.
తప్పుల్లేకుండా జాబితా రూపొందించాలి
కమిషనర్ జగ్జీవన్
నారాయణఖేడ్: తప్పులు లేకుండా ఓటరు జాబితాలను రూపొందించే విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఖేడ్ మున్సిపల్ కమిషనరు జగ్జీవన్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకోసం ఆదివారం వరకు 113 దరఖాస్తులు వచ్చాయన్నారు. అభ్యంతరాలకు సోమవారం సాయంత్రమే సమయం ఉండగా ఆలోపు అభ్యంతరాలను రాతపూర్వకంగా అందించాలని కమిషనరు సూచించారు. ఈనెల 10న తుదిఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు.
అందోల్ పిల్లలు అదరగొట్టారు
జిల్లాస్థాయి క్రీడల్లో మెరిసిన
పాలిటెక్నిక్ విద్యార్థులు
జోగిపేట(అందోల్): మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌మీట్ (ఐపీఎస్‌జీఎం)లో అందోలు–జోగిపేట బాలికల పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థినులు వివిధ క్రీడల్లో అదరగొట్టారు. ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానాన్ని నిలబెట్టుకోగా, అథ్లెటిక్స్‌లో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. వాణి సోమవారం మీడియాకు వెల్లడించారు. క్రీడల్లో మంచి ప్రతిభను కనబరిచి కళాశాలకు పేరు తెచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్‌తోపాటు కళాశాల సిబ్బంది అభినందించారు
మొబైల్ వాడుతూ
డ్రైవింగ్ చేయవద్దు
జిల్లా న్యాయ సేవాధికార
సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్ : మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సూచించారు. సంగారెడ్డిలోని పయనీర్స్ పాఠశాలలో రోడ్డు భద్రతపై సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో రోడ్ సురక్ష అభియాన్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహిస్తున్నామన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటం
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి
పటాన్‌చెరు: కార్మిక హక్కుల కోసం ఐఎన్‌టీయూసీ రాజీలేని పోరాటం చేస్తోందని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పేర్కొన్నారు. పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో హమాలీ కార్మికులకు సోమవారం గ్రాడ్యూటీ, ఇన్సూరెన్స్‌ను ఇప్పించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ..హమాలీ కార్మికులకు కోసం ఐఎన్‌టీయూసీ సంజీవరెడ్డి నాయకత్వంలో హమాలీ కార్మికులకు కార్మిక సంఘం ఏర్పాటు చేసి అనేక వేతన ఒప్పందాలు చేశామన్నారు.
మెట్రో ప్రయాణం సంతోషంగా ఉంది


