తేలిపోయాయి
న్యూస్‌రీల్
తన పరిధి కాకపోయినాప్రతిపాదనల ఫైలుపై సంతకాలు వెలుగులోకి అడ్డగోలు వ్యవహారాలు!
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
సంతకాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెరువుల పరిరక్షణ సర్వేలో అధికారుల అడ్డగోలు వ్యవహారాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఓ చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్‌ట్యాంక్ లెవల్), బఫర్‌జోన్ విస్తీర్ణాలను 14 ఎకరాలు తగ్గించేందుకు వేసిన పన్నాగంలో ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. రూ.కోట్లు విలువ చేసే ఈ చెరువు విస్తీర్ణం విషయంలో ఫైనల్ నోటిఫికేషన్ కోసం పంపిన ఫైలులో సదరు మండలంతో సంబంధంలేని ఓ అధికారి సంతకాలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బదిలీ వేటు పడిన ఈ అధికారి పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకుని తనకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ ఫైలుపై సంతకాలు చేసినట్లు నీటిపారుదలశాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆశాఖ ఉన్నతాధికారుల వద్దకు వచ్చిన ఈ ఫైలులో సంబంధం లేని ఈ అధికారి సంతకం కనిపించడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి లోతుగా పరిశీలించడంతో ఈ పన్నాగం బయటపడినట్లు తెలిసింది. దీంతో ఈ ప్రతిపాదనల ఫైలును తిప్పి పంపినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పాతుకుపోయిన మరో ఉన్నతాధికారి కూడా ఈ కుట్రలో పాత్ర ఉన్నట్లు సమాచారం. రూ.కోట్లు విలువ చేసే చెరువు భూమిని చెరబట్టేందుకు అక్రమార్కులు వేసిన స్కెచ్‌కు ఈ ఇద్దరు అధికారులు వంతపాడినట్లు ఆశాఖ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అస్తవ్యస్తంగా చెరువుల పరిరక్షణ సర్వే..
హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణలో భాగంగా చేపట్టిన సర్వే అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లాలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న సంగారెడ్డి, కంది, హత్నూర, జిన్నారం, రామచంద్రాపురం, పటాన్‌చెరు, గుమ్మడిదల, అమీన్‌పూర్ మండలాల్లో సుమారు 496 చెరువులున్నాయి. ఈ చెరువులన్నింటికీ ఫైనల్ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ కొనసాగుతోంది. నీటిపారుదలశాఖతోపాటు, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, సర్వే అండ్ రికార్డుల శాఖలు సంయుక్తంగా చేస్తున్న ఈ సర్వేలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కీలకమైన ఎఫ్‌టీఎల్‌తోపాటు, బఫర్ జోన్ల నిర్ధారణలో కొందరు అధికారులు చెరువులను చెరబట్టిన అక్రమార్కులకు భూమి కలిసొచ్చేలా ఫైనల్ నోటిఫికేషన్‌లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో చెరువుల విస్తీర్ణం రికార్డులను సైతం మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను సదరు అక్రమార్కులు రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన చెరువులపై లోతైన విచారణ జరిపితే ఈ అధికారుల బాగోతాలు మరిన్ని వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఫైనల్ నోటిఫికేషన్ ఈ సర్వే ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా ఆశాఖ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే చెరువులు కనుమరుగుకాకుండా కాపాడటం సాధ్యమవుతుందని అంటున్నారు.
తేలిపోయాయి
తేలిపోయాయి


