మైనారిటీలకు మరో అవకాశం
రూ.50 వేలు, రూ.లక్ష ఆర్థిక సాయం
ఈనెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
కుటుంబంలో ఒక్కరికి మాత్రమే
ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలి.
వయసు 21 ఏళ్లనుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
కనీస విద్యార్హత 5వ తరగతి ఉండాలి.
గత ఐదేళ్లలో(టీజీఎంఎఫ్‌సీ) నుంచి ఆర్థిక సహాయాలు
పొంది ఉండకూడదు.
భర్త, తండ్రి, రేషన్‌కార్డు, ఆధార్, ఆదాయ ధ్రువీకరణపత్రాలు ఉండాలి.
పథకం ద్వారా ఆర్థిక సాయం పొందేందుకు ఫకీర్ దుదేకుల/పేద స్థితిలో ఉన్న మైనారిటీలకు చెందిన వారు ఉండాలి.
ఆర్థిక భరోసా పథకాల దరఖాస్తుకు గడువు పెంపు
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల ఆర్థిక భరోసాకు రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. గతేడాది ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన, రేవంతన్నకా సహారా మిస్కిన్ కో లియే పథకాలను లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించింది. మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, పేదలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పథకాలు అమలు చేసేందుకు రూ.30 కోట్లను కేటాయించింది. రాష్ట్రం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పథకాలు అమలు కానున్నాయి.
ఎన్నికల కోడ్‌తో నిలిచి..
ఈ పథకాలకు గతేడాది అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా సెప్టెంబరులో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలతో దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో మైనార్టీల అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును పెంచారు. అర్హత గల మైనార్టీలు దరఖాస్తు చేసుకునేందుకు ttps://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10 వరకు ఆన్‌లైన్ విధానంలో నమోదు చేసుకుని స్థానిక మండల పరిషత్తు, మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించాల్సి ఉంటుంది.
జిల్లాలో 2లక్షలకు పైగా మైనార్టీలు
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 2.49లక్షలకు పైగా మైనార్టీలున్నారు. ఇప్పటివరకు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం కోసం 1503, రేవంతన్నా కా సహారా మిస్కినో కేలియే పథకం కోసం 222 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రూ.50 వేలతో ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజన ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకం ద్వారా రూ.50 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. నిరాశ్రయులు, వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, ఒంటరి మహిళలు లబ్ధి పొందనున్నారు. చిన్నపాటి వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ఆర్థికంగా సాయం అందించనున్నారు.
మోపెడ్ వాహనాలకు
100% సబ్సిడీతో రూ.లక్ష
రేవంతన్నా కా సహారా మిస్కినో కేలియే పథకం ద్వారా 100% సబ్సిడీతో మోపెడ్, ఈ చార్జింగ్ వాహనాలు కొనుగోలు చేసేందుకు రూ.లక్ష అందించనున్నారు. మైనారిటీల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు పథకాలను ప్రవేశపెట్టారు.
ఇవీ అర్హతలు
అర్హతలు


