సీఎంను కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు డివిజన్‌కు చెందిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల మురళీకృష్ణ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌తోపాటు హైదరాబాద్ ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నారాయణఖేడ్: తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌లను శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంఘ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జెట్ల భాస్కర్, అసోసియేట్ అధ్యక్షులు చింత బలరాం, ప్రధాన కార్యదర్శి వరప్రతాప్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, యాదగిరి, సంయుక్త కార్యదర్శులు బిజ్జల అరుంధతి, వెంకటేశం, జానకిరామ్, కార్యనిర్వాహక కార్యదర్శులు రుమాండ్ల వెంకటేశం, ముత్యాల సాయిప్రసాద్ కార్యవర్గ సభ్యులు కొండిరాజు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: రోడ్డు భద్రత ప్రజలందరి సామాజిక బాధ్యతని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని డీఎస్పీ సత్తయ్య స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో శుక్రవారం రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించడం, సెల్‌ఫోన్ చూడటం, నిద్రలేమివంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకూడదనిన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మార్వో జయరాం, సంగారెడ్డి రూరల్ సీఐ క్రాంతి, ఎస్సై మధుసూదన్‌రెడ్డి, ట్రాఫిక్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని గడి, మొగుడంపల్లి మండలంలోని ధనసిరి ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం ప్రత్యేక తనిఖీ బృందం సభ్యులు సందర్శించారు. జిల్లా నోడల్ అధికారి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిమ్మల కిష్టయ్య , వాహబొద్దీన్‌లు వసతులు, రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, టాయిలెట్స్ నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల సామర్థ్యం, వారి హాజరు అంశాలను పరిశీలించారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలలో రాయితీలు పొందేందుకు ప్రతి రైతు తమ ఐడీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి సూచించారు. రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి, మీసేవ కేంద్రాలలో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 10 వరకు గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అఽధికారి ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు.
సీఎంను కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సీఎంను కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సీఎంను కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


