లోగో రూపకల్పనలో గోపీకి అవార్డు
వెల్దుర్తి(తూప్రాన్): తెలంగాణ పోలీస్ వెహికల్ బ్రాండింగ్ లోగో రూపకర్త, మెదక్ జిల్లా, మాసాయిపేట మండలం రామంతాపూర్ తండా మాజీ సర్పంచ్ ఫకీరా అలియాస్ గోపీకి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ నార్త్ ఈస్ట్ కల్చరల్ ఫెస్టివల్‌కు సంబంధించి లోగో తయారీకి గతంలో రాష్ట్రవ్యాప్తంగా 190 మంది దరఖా స్తు చేసుకోవడంతో పాటు లోగోను తయా రు చేసి రాజ్‌భవన్‌కు పంపించారు. ఇందులో గోపి తయారు చేసిన లోగోను రాజ్‌భవన్ వర్గాలు ఎంపిక చేశాయి. దీంతో హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం రాత్రి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ గోపీకి ప్రశంసాపత్రం అందజేశారు.
లాడ్జిలో వ్యక్తి మృతి
సిద్దిపేటజోన్: లాడ్జిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉమ్మరవేణి రాజు(42) రెండు రోజుల క్రితం హైదరాబాద్ రోడ్డులోని ఓ లాడ్జిలో అద్దెకు దిగాడు. ఆదివారం అద్దె కోసం రూమ్ బాయ్ వెళ్లి చూడగా తలుపుపెట్టి ఉంది. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో లోనికి వెళ్లి చూడగా బాత్ రూమ్‌లో రాజు బోర్లాపడి మృతి చెంది ఉన్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందలేదని తెలిపారు.


