తాగి నడిపితే జైలుకే..
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు జిల్లాలో తొలిసారిగా అమలు అక్టోబర్ నుంచి 1,951 మంది పట్టివేత కమిషనరేట్ పరిధిలో నిత్యం డ్రంకెన్‌డ్రైవ్
నీటి అలలపై తేలియాడుతున్న కలువ పూలు కనువిందు చేస్తున్నాయి. తెలుపు, పసుపు వర్ణంతో మెరిసిపోతూ అర విరిసిన కలువ పూలు ముగ్ధ మనోహరంగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ‘వాటర్ వైట్ లిల్లీ ఫ్లవర్స్’గా పిలువబడే ఇవి మంచి నీటి సరస్సులు, చెరువులు, కుంటల్లో పెరుగుతాయి. ఎక్కువగా ఆఫ్రికా, మధ్య ఆసియా వంటి ప్రాంతాల్లో పెరిగే ఈ కలువ మన దేశంలో అరుదుగా కనిపించడం విశేషం. మిరుదొడ్డిలోని బొమ్మరాజు చెరువులో పెరుగుతున్న ఈ కలువ పూలను ఆదివారం ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది.
– మిరుదొడ్డి(దుబ్బాక)
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష అమలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రతి రోజు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపర్చగా రూ.10వేల జరిమాన, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. జిల్లాలో తొలిసారిగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి రూ.10వేల జరిమాన విధింపు గత నెల 6నుంచి అమల్లోకి వచ్చింది. పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో సిబ్బంది నిత్యం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో తాగి బైక్ నడుపాలంటే మందుబాబుల వెన్నులో వణుకు పుడుతుంది. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం తాగి నడపడం వల్ల చోటుచేసుకునేవే. ఒక్కరు చేసిన తప్పుకు కుటుంబాలు రోడ్డు పాలయ్యే ప్రమాదం ఏర్పడుతోంది.
పోలీసు కమిషనరేట్ పరిధిలో సిబ్బంది అక్టోబర్ 6నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో 1,951 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి 1,321 మందికి రూ.60,90,724 జరిమాన విధించారు. మొదటిసారి పట్టుబడితే రూ.10వేల జరిమాన, జరిమాన చెల్లించకపోతే జైలు శిక్ష, రెండేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. రెండోసారి పట్టుబడితే రూ.15వేల జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. నెల రోజుల్లో 59 మందికి రెండు నుంచి పది రోజుల వరకు జైలు శిక్ష విధించారు.
డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న పోలీసులు
కలువల కనువిందు
సిద్దిపేట పట్టణం రాజీవ్ రహదారిపై గత నెలలో ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో గోదావరిఖని నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతున్నాడు. వెనకాలే వస్తున్న వాహనదారుడు గమనించి డయల్ 100కు కాల్ చేసి చెప్పాడు. టూటౌన్ పోలీసులు లారీని ఆపి డ్రైవర్‌ను బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా మెషీన్ కెపాసిటీ 500శాతం ఉండగా పరీక్షల్లో 471శాతం వచ్చింది. అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జైలు శిక్ష విధించింది.
జిల్లా కేంద్రం సిద్దిపేటలో నాలుగు రోజుల క్రితం పోలీసుల వాహన తనిఖీల్లో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డాడు. పోలీసులు అతడిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి అతడికి రూ.10వేల జరిమాన విధించారు. జరిమాన చెల్లించకపోతే జైలు శిక్ష అమలు చేయాలంటూ తీర్పునిచ్చారు.
చట్టప్రకారం చర్యలు
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వారికి రూ.10వేల జరిమాన అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలి.
– సుమన్‌కుమార్, ట్రాఫిక్ ఏసీపీ, సిద్దిపేట
తాగి నడిపితే జైలుకే..
తాగి నడిపితే జైలుకే..
తాగి నడిపితే జైలుకే..


