
జోరుగా అక్రమ మట్టి రవాణ
జిన్నారం (పటాన్‌చెరు): ప్రభుత్వ భూముల్లో రాత్రి వేళ అక్రమ మట్టి రవాణ జోరుగా సాగుతోంది. జిన్నారం మున్సిపాలిటీ కొడకంచి పరిధిలోని సర్వేనం 286 ప్రభుత్వ భూమి నుంచి కొందరు అక్రమార్కులు జోరుగా మట్టిని తరలిస్తూ లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నారు. వారం రోజులుగా రాత్రి పది దాటిందంటే చాలు టిప్పర్ల ద్వారా శివనగర్ ఎల్‌ఈడీ పార్కులోకి భారీగా మట్టి రవాణ చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి మట్టి రవాణకు అడ్డుకట్ట చేయాలని కోరుతున్నారు. లేదంటే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరిస్తున్నారు.