
అర్హులందరికీ పథకాలు
మునిపల్లి(అందోల్): రాజకీయ పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మండలంలోని తాటిపల్లిలో ఆదివారం యువజన సంఘం నాయకులు కలిసి మంత్రికి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ...రాజకీయాలకతీతంగా అందరం కలిసి అభివృద్ధి చేసుకునేందుకు ఇది మంచి సువర్ణావకాశమన్నారు. స్థానిక సంస్థలకాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీదేనని యువకులకు సూచించారు. కార్యక్రమంలో రాయికోడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైపాల్, యువత నాయకులు మారుతి, నరేశ్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
గురు శిష్యుల అనుబంధం పూర్వజన్మ సుకృతం
రాయికోడ్ (అందోల్ ): ప్రతీ గురు శిష్యుల అనుబంధం పూర్వ జన్మ సుకృతం అని మంత్రి దామోదర వ్యాఖ్యానించారు. మండలంలోని ఇందూర్ గ్రామ శివారులోని ఆశ్రమంలో చిన్మయ జ్ఞానీ శ్రీ చెన్న మల్లికార్జున స్వామి వారి 49వ జన్మదిన వేడుకలకు మంత్రి హాజరై మాట్లాడారు. బసవేశ్వరుడి బోధనలు ఆచరించి సన్మార్గంలో భక్తితో, నిజాయితీతో ప్రతీ ఒకరు జీవించాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న బొగ్గులంపల్లి గ్రామ శివారులోని వంతెన పనులను నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. బుదేరా రోడ్ నిర్మాణ పనులపై సూచనలు చేశారు.
మంత్రి దామోదర రాజనర్సింహ