
పథకాలపై ప్రజల్లో ఆదరణ
నారాయణఖేడ్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన నిజాంపేటకు చెందిన బీఆర్‌ఎస్‌కు సంబంధించిన 30 కుటుంబాల నుంచి 100 మంది ఆదివారం ఖేడ్‌లో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాయితీపై వంటగ్యాస్, రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోపాటు ఎమ్మెల్యే సంజీవరెడ్డి చేస్తున్న అభివృద్ధి, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న తీరుపట్ల ఆకర్షితులమై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. కాగా, పార్టీలో చేరినవారిలో మాజీ వార్డు సభ్యులు రమేశ్, నాయకులు సంజీవులు, బాలయ్య, శ్రీనివాస్ తదితరులున్నారు.
స్థానిక పోరులో కాంగ్రెస్‌ను గెలిపించండి
కంగ్టి(నారాయణఖేడ్): కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతస్థాయిలో ప్రచారం చేసి వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని రాంసింగ్ తండాకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో దివంగత కిష్టారెడ్డి హయాంలో వేసిన ఫార్మేషన్ రోడ్డు నేటికీ అలాగే ఉందని మళ్లీ తానే బీటీ రోడ్డు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండి తండాలకు చేసిన అభివృద్ది ఏమీ లేదన్నారు. అన్నీ తండాలకు బీటీ రోడ్ల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి