
మట్టి.. కొల్లగొట్టి
అఽదికారుల కనుసన్నల్లోనే కాంట్రాక్టరు అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండిపెడుతున్నాడని ఆరోపిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు తరలించిన మట్టి విషయంలో బిల్లులలో కోత విధించాలని కోరుతున్నారు.
● రోడ్డు నిర్మాణం పేరిట సర్కారు భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు ● మట్టి తరలింపులో రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానాలు
వట్‌పల్లి(అందోల్): ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.లక్షల ఆదాయం కాంట్రాక్టరు జేబులోకి చేరుతున్నాయి. పట్టపగలే అధికారుల ముందు నుంచే వందల టిప్పర్ల మట్టిని రోడ్డుకు తరలిస్తున్నా తమకేమీ పట్టదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రమైన వట్‌పల్లిలో ప్రధాన రహదారి విస్తరణ పనులకు రూ.2.97 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు ఇటీవల రోడ్డు పనులను ప్రారంభించారు. రోడ్డు పనులు నిర్వహిస్తూ అవసరమైన మొరం(మట్టి) కోసం సంబంధిత మైనింగ్ శాఖ వద్ద ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కాంట్రాక్టర్ తన రాజకీయ పలుకుబడితో స్థానిక తహసీల్దారు వద్ద అనుమతి పత్రం పొంది ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి మొరంను తరలించినా అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
లక్షల్లో మట్టి దోపిడి...
మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మైనింగ్ శాఖకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వారు ఎల్‌ఓసీ కోసం స్థానిక తహసీల్దారుకు పంపుతారు. తర్వాత సంయుక్తంగా సర్వే చేసిన తవ్వకాల ప్రణాళిక, పర్యావరణ, సీఎఫ్‌వో, సీఎఫ్‌ఈ వంటి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అన్ని అనుమతులు వచ్చాక తగినంత రుసుము చెల్లిస్తేనే మైనింగ్ అధికారులు మట్టి తవ్వకాలకు అనుమతులిస్తారు. కానీ అవన్నీ తన రాజకీయ పలుకుబడి ముందు పనిచేయవన్నట్లు కాంట్రాక్టరు స్థానిక తహసీల్దారు వద్దకు వెళ్లి ఓ అనుమతి పత్రాన్ని పొంది, స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి రహదారి నిర్మాణానికి తరలించాడు. విషయం తెలిసిన స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు దీన్ని అడ్డుకోగా కాంట్రాక్టరు తన రాజకీయ పలుకుబడితో అడ్డుజెప్పిన స్థానిక నాయకులకు ఓ ముఖ్య నాయకురాలితో ఫోన్ చేయించడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ప్రభుత్వానికి రావాల్సిన లక్షల ఆదాయానికి గండి పడుతున్న విషయమై స్థానికులు తహసీల్దారు, అందోలు ఆర్డీఓల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో కాంట్రాక్టరు లక్షల విలువ చేసే మట్టిని రోడ్డుకు తరలించే పనులను దాదాపుగా పూర్తి చేశారు.
బిల్లుల్లో కోత విధిస్తారా..?
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి

మట్టి.. కొల్లగొట్టి