తుఫాన్‌లో చెలరేగిన మంటలు | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌లో చెలరేగిన మంటలు

Aug 26 2025 8:34 AM | Updated on Aug 26 2025 8:34 AM

తుఫాన్‌లో చెలరేగిన మంటలు

తుఫాన్‌లో చెలరేగిన మంటలు

పటాన్‌చెరు టౌన్‌: తుఫాన్‌ వాహనంలో మంటలు చెలరేగి పాక్షికంగా కాలిపోయింది. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం... మెదక్‌ జిల్లా రేగోడు మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 12 మంది సోమవారం బీరంగూడ లోని ఓ వేడుకకు వెళ్తున్నారు. కాగా, స్వామివారిని దర్శించుకునేందుకు వాహనాన్ని గణేశ్‌ దేవాలయ ఆవరణలో నిలిపి లోపలికి వెళ్లారు. ఈ లోపు వాహనంలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దేవస్థానం సిబ్బంది నీటితో మంటలను అదుపు చేశారు. అయినా అప్పటికే వాహనం పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement