రక్తదానం ప్రాణదానంతో సమానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానంతో సమానం

Aug 26 2025 8:34 AM | Updated on Aug 26 2025 8:34 AM

రక్తద

రక్తదానం ప్రాణదానంతో సమానం

గీతంలో 160 మంది రక్తదానం

గీతంలో 160 మంది రక్తదానం

పటాన్‌చెరు: భారతదేశం, నేపాల్‌లో లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించి, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాలని బ్రహ్మకుమారీస్‌ సంకల్పించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బ్రహ్మకుమారీలు (చందానగర్‌ శాఖ), సోషల్‌ సర్వీస్‌ వింగ్‌ (ఆర్‌ఈఆర్‌ఎఫ్‌), రెడ్‌ క్రాస్‌ సొసైటీల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని అదనపు ఉప కులపతి ప్రొఫెసర్‌ డీ.ఎస్‌.రావు, రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. శిబిరంలో దాదాపు 160 మంది విద్యార్థులు రక్తదానం చేయగా, వీరికి బ్రహ్మకుమారీలు ప్రశంసా పత్రాలు అందజేశారు.

నీటి గుంతలో పడి

యువకుడి మృతి

చిన్నకోడూరు(సిద్దిపేట): ఓ యువకుడు నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దకోడూరులో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... ఆనరాశి లక్ష్మి, సత్తయ్య దంపతుల కుమారుడు రాజు(20) కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో వాళ్ల ఇంటి సమీపంలోని నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికులు గుర్తించి 108లో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మద్యానికి బానిసై

వ్యక్తి ఆత్మహత్య

పటాన్‌చెరు టౌన్‌: ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జీడిమెట్లకు చెందిన బసవరాజు (38) రెండు నెలల క్రితం ముత్తంగి సాయిప్రియ కాలనీకి వచ్చి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే బసవరాజు రోజు మద్యం తాగుతున్నాడు. ఐదు రోజుల నుండి భార్యాభర్తల మధ్య సంసార విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 24న రాత్రి భార్యను కొట్టడంతో పిల్లలని తీసుకుని ఇస్నాపూర్‌లో ఉన్న తన అక్క జగదీశ్వరి ఇంటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం భార్య ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు గడియపెట్టి ఉండటంతో కిటికీ నుంచి చూసింది. అప్పటికే భర్త ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నాడు.

అక్రమంగా తరలిస్తున్న

పశువుల పట్టివేత

గజ్వేల్‌రూరల్‌: అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్నారు. గజ్వేల్‌ సీఐ రవికుమార్‌, పశువైద్యశాఖ ఏడీ రమేశ్‌ వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం ప్రాంతం నుంచి ఓ కంటైనర్‌లో 89 పశువులను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ శివారు పాతూరు కూరగాయల మార్కెట్‌ సమీపంలో పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను పట్టుకున్నారు. ఇందులో 54గోవులు ఉండగా మిగతా 35 పశువులు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 5గోవులు, 2 పశువులు మృతి చెందాయి. పశువులను ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని లక్ష్మాపూర్‌లోగల గోశాలకు పంపించారు. ఒక డ్రైవర్‌ పారిపోగా, మరో డ్రైవర్‌తోపాటు క్లీనర్‌లను అదుపులోకి తీసుకున్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం 1
1/1

రక్తదానం ప్రాణదానంతో సమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement