
డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ
జాతీయ రహదారిపై ట్రాఫిక్
పటాన్‌చెరు టౌన్: ఉల్లి లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా పడింది. వివరాలు ఇలా.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయ బాలాజీ గార్డెన్ సమీపంలో సోమవారం జాతీయ రహదారిపై సంగారెడ్డి వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఉల్లి లోడ్ లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న ఉల్లి మూటలు జాతీయ రహదారిపై పడ్డాయి. ఆరు కిలోమీటర్ల మేర రుద్రారం వరకు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సీఐ లాలు నాయక్, సిబ్బందితో కలిసి క్లియర్ చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌ను వాహనదారులు డివైడర్ దాటించి పంపించారు. సంగారెడ్డి ట్రాఫిక్ పోలీసులు, కంది వైపు నుంచి వచ్చే వాహనాలను ఇతర దారుల గుండా మళ్లించారు.