
వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నర్సాపూర్: హాస్టళ్లలో వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజీల ప్రాంతీయ సమన్వయ అధికారి దివం బహుమతి సూచించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మైనారిటీ పాఠశాలలు, కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలు, కాలేజీల పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసిజర్ నిబంధనలు పాటించాలన్నారు. మెనూ పాటించాలని, విద్యా విధానాలు, డైనింగ్ విధానాలను ప్రిన్సిపాల్స్ నిరంతరం పరిశీలించాలని సూచించారు. సమావేశంలో విజిలెన్స్ అధికారులు మహ్మద్‌గౌస్, జగదీశ్వర్‌రెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ వసీమోద్దీన్, స్థానిక పాఠశాల కాలేజీ ప్రిన్సిపాల్ నసీమా షేక్ పాల్గొన్నారు.