శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

Aug 25 2025 9:13 AM | Updated on Aug 25 2025 9:13 AM

శతాబ్

శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ మెదక్‌ విభాగ్‌ బౌదిక్‌ ముత్యం కృష్ణ కోరారు. న్యాల్‌కల్‌లోని శ్రీ కృష్ణ కన్వెన్షన్‌హాల్‌లో ఆదివారం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ... ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారన్నారు.

సురవరానికి ఘన నివాళి

జహీరాబాద్‌ టౌన్‌: సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్‌ మాట్లాడుతూ.. పేదల కోసం పరితపించిన మహానీయుడన్నారు. ఆయన మృతి పార్టీ కి తీరనిలోటని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు.

వడ్డెరల సంక్షేమానికి కృషి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు..వడ్డెర కులస్తుల సంక్షేమానికి అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని బీరంగూడ మంజీరనగర్‌లో నూతనంగా నిర్మించిన వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వడ్డెరలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.

మట్టి గణపతినే పూజించండి

ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌

సంగారెడ్డి: వినాయక చవితి పండుగను అందరూ పర్యావరణహితంగా జరుపుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అసోసియేషన్‌ సభ్యులు అఖిల్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే సూచించారు.

ఘనంగా జాతీయ

క్రీడా దినోత్సవం

సంగారెడ్డి జోన్‌: పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఆదివారం సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి 5 కే రన్‌ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా యువజన క్రీడా అధికారి ఖాసీం బేగ్‌తోపాటు సుమారు 300మంది విద్యార్థులు పాల్గొన్నారు.

మండపాలకు ఉచిత విద్యుత్‌

నారాయణఖేడ్‌: గణేశ్‌, దేవీ నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా విగ్రహాల కోసం ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు ఖేడ్‌ ఏడీఈ నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎస్‌పీడీటీసీఎల్‌ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈనెల 27 నుంచి సెప్టెంబరు 6వ వరకు గణేశ్‌ మండపాలకు, సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2వ వరకు దేవీ నవరాత్రుల ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్‌ పొందవచ్చన్నారు. గతంలో డీడీలు కట్టడం తప్పనిసరని చెప్పినా తాజా ఉత్తర్వులతో ఉచితంగా పొందవచ్చని తెలిపారు.

శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి1
1/3

శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి2
2/3

శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి3
3/3

శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement