
పింఛన్లు పెంచకుంటే ఉద్యమమే
జహీరాబాద్ టౌన్/జోగిపేట(అందోల్): హైదరాబాద్‌లో నిర్వహించే మహాసభ కంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెన్షన్లు పెంచితే గౌరవంగా ఉంటుందని, లేదంటే ఉద్యమంగా మారి అదే ఉరితాడవుతుందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న మహాగర్జన సన్నాహక సదస్సును పట్టణంలోని ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించారు. అంతకుముందు అందోల్‌లోని శ్రీలక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో సన్నాహక సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణమాదిగ మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధుల పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి 20 నెలల గడిచినా అమలుచేయకపోవడం అంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. దివ్యాంగులు, వృద్ధులు ఏం చేస్తారులే అనుకుంటే రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితమే తారుమారవుతుందని హెచ్చరించారు.
ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మందకృష్ణమాదిగ