
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: అప్పుల బాధతో వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కేఎస్‌ఆర్ కాలనీకి చెందిన పూనంచంద్ స్థానికంగా అప్పులు చేశాడు. వారు తిరిగి చెల్లించమని రోజు ఫోన్ చేస్తుండటంతో ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టాడు. దీంతో అప్పు ఇచ్చినవారు భార్యకు ఫోన్ చేసి తిడుతున్నారు. ఈ క్రమంలో భార్య మమత భర్తను ఎందుకు అప్పులు చేస్తున్నావని ప్రశ్నించింది. కాగా ఈనెల 18న పూనంచంద్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు.
చెల్లింటికి వచ్చిన మహిళ..
చిన్నశంకరంపేట(మెదక్): చెల్లింటికి వచ్చిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... మనోహరబాద్ మండలం పరికిబండ గ్రామానికి చెందిన చింతల కవిత(40) ఈ నెల 21న చందాపూర్‌లోని తన చెల్లింటికి వచ్చింది. ఆరోజు నుంచి కన్పించకుండా పోయిందని, ఆమె మతిస్థిమితంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కవిత సోదరుడు నగేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పటాన్ చెరులో యువకుడు..
పటాన్‌చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగికి చెందిన నాగులమ్మ కొడుకు రాజు ఈ నెల 21న ఉదయం తల్లి దగ్గర రూ.2 వందలు తీసుకొని బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుమారుని కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం

వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం