
దత్తగిరిలో దామోదర పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రమైన బద్దిపూర్ శ్రీ దత్తగిరి మహరాజ్ ఆశ్రమంలో శనివారం అమావాస్యను పురస్కరించుకుని శ్రీ శనీశ్వర జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏడాకులపల్లిలో ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కాగా, బర్దిపూర్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతులు తీర్థ ప్రసాదాలు అందించి, పూలమాల శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్దేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు.
కేతకీలో భక్తుల రద్దీ
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వరాలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం చివరి రోజు కావడంతోపాటు అమావాస్యను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలను ఆచరించి, జల లింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులను సందర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

దత్తగిరిలో దామోదర పూజలు

దత్తగిరిలో దామోదర పూజలు