పటాన్‌చెరు టౌన్: రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులపల్లికి చెందిన ప్రభుదాస్ (33) మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ద్విచక్ర వాహనంపై రంగారెడ్డి జిల్లా.. శంకర్‌పల్లి కొత్తగూడకు పనిపై వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వంద ఫీట్ల సర్వీస్ రోడ్డులో నాగులపల్లి శివారు అపర్ణ గేట్ సమీపంలోకి రాగానే సంధుగూడంకు చెందిన వడ్డే నాగేష్ (35) తన ద్విచక్రవాహనంతో ప్రభుదాస్ పల్సర్‌ను ఢీకొట్టాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రభుదాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడ్డ నాగేష్‌ను చికిత్స కోసం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


