సీఎం పర్యటన విజయవంతం చేయాలి
సంగారెడ్డి జోన్/జహీరాబాద్: జహీరాబాద్ లో ఈనెల 23న జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోశ్ పంకజ్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ...ీసీఎం పర్యటనలోభాగంగా రూట్ మ్యాప్, సెక్యూరిటీ బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, హెల్త్ క్యాంప్, హెలిప్యాడ్ తదితర ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయం, నిమ్జ్ రోడ్డు, ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు ఎస్పీ సంజీవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం సభ కోసం ఏర్పాట్లు ముమ్మరం
సీఎం జహీరాబాద్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభా వేదిక ఏర్పాట్లను ఆర్‌డీఓ రాంరెడ్డి, డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు, తహసీల్దార్ దశరథ్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావులు పర్యవేక్షించారు. మైదానంలో హెలికాప్టర్ దిగేందుకు వీలుగా రూ.3.50లక్షల వ్యయంతో సీసీ నిర్మాణం పనులను ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు చేపట్టారు.
మంత్రి దామోదర రాజనర్సింహ


