పటాన్‌చెరు డీఎస్పీగా ప్రభాకర్
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు నూతన డీఎస్పీగా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ చీఫ్ ఆఫీస్ డీజీ కంట్రోల్‌రూమ్‌లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ పటాన్‌చెరు డీఎస్పీగా బదిలీపై వచ్చారు. ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన డీఎస్పీ రవీందర్‌రెడ్డి హైదరాబాద్ డీజీపీ ఆఫీస్‌కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ...ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో ముందుంటామని తెలిపారు. మహిళ ల భద్రత కోసం బస్టాండ్‌లో, విద్యాసంస్థలు వద్ద షీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. బదిలీపై వెళ్తున్న డీఎస్పీ రవీందర్‌రెడ్డి పదవీ బాధ్యతలను డీఎస్సీ ప్రభాకర్‌కు అప్పగించారు.
వేణుగోపాలస్వామి
ఆలయంలో ప్రత్యేక పూజలు
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జేపీకాలనీ వేణుగోపాలస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కంకణధారణ, స్వామివారి అభిషేకం, హోమం, హరినామ సంకీర్తనలు నిర్వహించారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం చేశారు.
పటాన్‌చెరు డీఎస్పీగా ప్రభాకర్


